నాలుగు రోజుల్లోగా పేరుకుపోయిన చెత్తను తొలగించండి, కేటిఆర్ ఆదేశాలు !

హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు.

ప్రతి సర్కిల్ లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటి కమిషనర్, సంబంధిత పారిశుధ్య అధికారులు ప్రతిరోజు ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పూర్తిస్థాయిలో గార్బేజ్ ను తొలగించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకుగాను అవసరమైన అదనపు వాహనాలు,డంపర్లు,టిప్పర్లను సమకూర్చుకోవాలని మంత్రి ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై రోజు ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ ముమ్మరంగా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.