తెలంగాణ లో పదో తరగతి పరీక్షలు రద్దు

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో SSC బోర్డు పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆబ్జెక్టివ్ తరహా పద్దతిలో మూల్యాకంనం చేపడతామన్నారు. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు కోవిడ్ పరిస్థితి చక్కబడిన తరువాత పరీక్షలు రాసే అవకాశం ఇస్తామనీ ఆమె పేర్కొన్నారు. జూన్ మొదటి వారంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల పై నిర్ణయం తీసుకుంటారు. 15 రోజుల ముందుగానే విద్యార్థులకు సమాచారం ఇస్తారు. ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే రెండవ సంవత్సరంలోకి అనుమతిస్తారు.