దేశంలో నెంబర్వన్ ఈ- పంచాయతీ అవార్డు దక్కించుకున్న తెలంగాణ

గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహరా ప్రకటించారు. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ పంచాయత్ పురస్కారాలను అందచేస్తున్నది. ఈ ఏడాది 2019-20 కి గాను ఈ e-award దక్కింది.

దీనిపై స్పందించిన తెలంగాణ పంచాయత్ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ కృషి, ముందు చూపు, చొరవ, మార్గదర్శనం వల్లే ఈ అవార్డులు రాష్ట్రానికి దక్కాయి అన్నారు.