వైఎస్ షర్మిల ఖమ్మం టూర్ షెడ్యూల్ ఖరారైంది. కోవిద్ నిబంధనల నడుమ వైఎస్ షర్మిల ఖమ్మం పబ్లిక్ మీటింగ్ కి ఇదివరకే అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం జరగనున్న పబ్లిక్ మీటింగ్ కి వెళ్లే సమయంలో జరగబోయే కార్యక్రమాల గురుంచి ఒక షెడ్యూల్ విడుదల చేసింది టీం .
ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి బయలుదేరి లక్డీకాపూల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ మీదుగా 9.30 గంటలకు హయత్‌నగర్ చేరుకోనున్నారు. ఇక్కడ ఆమెకు అనుచర శ్రేణులు స్వాగతం పలుకుతాయి. ఉదయం 10.15 గంటలకు చౌటుప్పల్, మధ్యాహ్నం 12 గంటలకు నకిరేకల్, 12.45 గంటలకు సూర్యాపేటలో దారిపొడవునా శ్రేణుల స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం మార్గంలో చివ్వెంల వద్ద భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మోతె మండలం నామవరంలో, 3 గంటలకు ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5.15 గంటలకు పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు రానున్నారు.