తెలంగాణాలో టీడీపీ దుకాణం సద్దేసింది. టీడీపీ కి చెందిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు రాజీనామా చేశారు. తెరాస లో టీడీపీ శాసనసభాపక్షం( TDLP) విలీనం చేయనున్నారు. టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావు టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. కాసేపట్లో మచ్చా నాగేశ్వరరావు తెరాస లో చేరనున్నారు.