బీజాపూర్ ఎన్కౌంటర్పై మావోయిస్టు కమిటీ స్పందించింది. పోలీసులతో జరిగిన దాడిలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని ప్రకటించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మాపై దాడికి యత్నించాయని తెలిపింది. పోలీసులు మాకు శత్రువులు కాదని పోలీసు మృతుల కుటుంబాలకు మావోయిస్టు కమిటీ సంతాపం తెలిపింది. బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్ట్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యవర్తుల పేర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే రాకేశ్వర్ను అప్పగిస్తామని అప్పటివరకు తమ దగ్గరే రాకేశ్వర్ సురక్షితంగా ఉంటాడని ప్రకటనలో స్పష్టం చేసింది.