కోవిడ్-19 నియంత్రణలో భాగంగా కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో రోజువారీ కేసులు లక్ష దాటున్న తరుణంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.