428 కోట్ల నగదు సీజ్ చేసిన తమిళనాడు ఎస్‌ఈసీ

రేపు (ఏప్రిల్ 6) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) 428 కోట్లు విలువ చేసే బంగారం, నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను సీజ్‌ చేసింది. ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన రూ. 225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు ముందు 72 గంటలు అత్యంత కీలకమని, ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఈసీ వివరించింది.