తెలుగులో సీక్వెల్ సినిమా విజయం సాధించిన దాఖలా లేదు. మని సినిమా నుంచీ ఆర్య వరకూ పార్ట్ 2 అని పేరు పెట్టిన సినిమాలన్నీ ఎగిరిపోయాయి. అయినా సరే.. గబ్బర్ సింగ్ 2 తీయడానికి పవన్ సాహసం చేస్తున్నాడు. అంతే కాదు.. ఆ సినిమాని సంపత్‌నందికి అప్పజెప్పడం కూడా రిస్కే. ఎందుకంటే గబ్బర్ సింగ్ 2పై అంచనాలు మామూలుగా ఉండవు. దాన్ని కొత్త దర్శకుడిపై మోపడం అంత కరెక్ట్ కాదేమో అని పవన్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాపై పవన్‌కి ప్రత్యేక మైన ఆలోచనలున్నాయి. ఈ కథ పవన్‌దే. గబ్బర్ సింగ్‌తో ప్రేక్షకులు పోల్చుకోకుండా కొత్త కథ రాసుకొన్నాడని తెలిసింది. కేవలం గబ్బర్ సింగ్ అనే బ్రాండ్‌ని మాత్రమే వాడుకోవాలని.. కథ, పాత్రలను కాదని పవన్ భావిస్తున్నాడట. మరి పవన్ ఆలోచనలు ఎంత వరకూ కరెక్ట్ అవుతాయో చూడాలి. ఒకవేళ గబ్బర్ సింగ్ 2 కూడా విజయం సాధిస్తే… సీక్వెల్ పరాజాయాల పరంపరను బ్రేక్ చేసిన అరుదైన రికార్డు పవన్ సొంతం అవుతుంది. దాని కోసమే అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.