చత్తీస్‌ఘడ్ లో రెచ్చిపోయిన మావోయిస్టులు

చత్తీస్‌ఘడ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మావోయిస్టులు బీజాపూర్‌ జిల్లా టారెమ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ చేస్తుండగా ఎదురుగా వచ్చిన మావోయిస్టులు వారిపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం ఇప్పటికి 7 గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు జవాన్లు ఉండగా ఇద్దరు మావోయిస్టులు ఉన్నారు. మొత్తం 20 మంది జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా టారెమ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగాయి.