జమ్ములో శ్రీవారి ఆలయం, 40 ఏళ్లపాటు టీటీడీకి లీజు

జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆ రాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా నేతృత్వంలో అడ్మినిస్ట్రేటివ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. సదరు స్థలాన్ని 40 ఏళ్లపాటు టీటీడీకి లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, యాత్రికుల కోసం వసతి సముదాయాలు, పార్కింగ్‌ వసతులను ఏర్పాటు చేయనుంది.