ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్రామ వార్డు వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. సేవా వజ్రకు రూ.30 వేలు, సేవారత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు, శాలువాతో ప్రభుత్వం సత్కరించనుంది. ప్రకృతి వైపరీత్యాల్లో అందించిన సేవలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఈ నెల 13న ఉగాది రోజున గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.