గ్రేటర్ హైదరాబాద్ లో రెండో విడుత కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దీని నివారణకు అధికారులు, సిబ్బంది పాటించాల్సిన చర్యలపై జిహెచ్ఎంసి ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులు, జోనల్, డిప్యూటి కమిషనర్లను ఆదేశిస్తూ సర్క్యూలర్ జారీచేశారు.
- కార్యాలయంతో పాటు, పబ్లిక్ ప్లేసెస్ లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
- పబ్లిక్ ప్లేస్ లో కనీసం రెండు గజాల దూరాన్ని పాటించాలి.
- కార్యాలయాలు, సెక్షన్లలో విజిటర్లను నియంత్రించాలి.
- భౌతిక దూరాన్ని విధిగా పాటించాలి.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసేవారికి నిబంధనల మేరకు జరిమానాలు విధించాలి.
- ప్రవేశ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను ఏర్పాటు చేయాలి.
- సందర్శకులు అధికంగా వచ్చే కార్యాలయాలు, విభాగాలలోని డోర్లు, హ్యాండిళ్లు, రాడ్స్ లను తరచుగా శానిటైజేషన్ చేయాలి.
- ఎస్కిలేటర్లు/ లిఫ్ట్ ల వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించి మెట్లపై వెళ్లాలి.
- ఎమర్జెన్సీ మినహా ఫైళ్లన్నింటిని ఈ-ఆఫీస్ ద్వారానే పంపించాలి.
- ఎయిర్ కండీషన్లు, కూలర్ల వినియోగాన్ని తగ్గించాలి.