జిహెచ్ఎంసి అమలు చేస్తున్న పలు అభివృద్ది పథకాలను శిక్షణ పొందుతున్న ఐ.ఏ.ఎస్ ల బృందం నేడు అద్యయనం చేసింది. 2019 బ్యాచ్ కు చెందిన 8 మంది ప్రొబేషనరి ఐ.ఏ.ఎస్ అధికారుల బృందానికి జిహెచ్ఎంసి అమలుచేస్తున్న పలు కార్యక్రమాలైన శానిటేషన్, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, రెవెన్యూ, అర్భన్ బయోడైవర్సిటీ, ఐటి, స్పోర్ట్స్, ప్రాజెక్ట్స్ తదితర అంశాలపై సంబంధిత విభాగాధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2019 బ్యాచ్ కి చెందిన కర్నాటి వరుణ్ రెడ్డి, చిత్ర మిశ్రా, పాటిల్ హేమంత కేశవ్, గరిమ అగర్వాల్, దీపక్ తివారి, ప్రతిమా సింగ్, అకింత్, రెజ్వాన్ భాషా షేక్ లు జిహెచ్ఎంసి ని సందర్శించిన వారిలో ఉన్నారు. అనంతరం ఈ అధికారులు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.