ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కర్నూల్ జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్పోర్టులో విమానాల సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఈ విమానానికి మంత్రులు బుగ్గన, జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని ఘన స్వాగతం పలికారు. అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది. దీంతో పాటు ఉ: 10:30కి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు నగరాలకు ఇండిగో సంస్థ విమానాలు నడపనుంది.