కేంద్రీయ విద్యాలయాలలో 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1, 2021 నుండి ప్రారంభమవుతుంది. రెండవ తరగతి మరియు ఆపై తరగతుల ప్రవేశాలకు ఏప్రిల్ 8, 2021 నుండి ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది.
మొదటి తరగతి కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు 2021 ఏప్రిల్ 1 న ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతాయి. 2021 ఏప్రిల్ 19 న రాత్రి 7:00 గంటలకు ముగుస్తాయి. ప్రవేశ వివరాలను https: //kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌తో పాటు అండ్రాయిడ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
2021-2022 విద్యా సంవత్సరానికి కెవిఎస్ ఆన్‌లైన్ ప్రవేశం కోసం అధికారిక అండ్రాయిడ్ మొబైల్ యాప్‌ను డౌన్‌లౌడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ మరియు ఇన్‌స్టాల్ చేయడానికి సూచనలు https://kvsonlineadmission.kvs.gov.in/appsతో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా లభిస్తాయి.
క్లాస్ II మరియు ఆపై తరగతులకు సీట్ల లభ్యత ఆధారంగా 08.04.2021 ఉదయం 8:00 నుండి 15.04.2021 సాయంత్రం 4:00 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించబడతాయి.
షెడ్యూల్ ప్రకారం 2021-2022 సంవత్సరానికి సంబంధించి XI తరగతి ప్రవేశాల కోసం, కెవిఎస్ ( HQ) వెబ్‌సైట్ (https://kvsangathan.nic.in) లో లభ్యమయ్యే రిజిస్ట్రేషన్ ఫారాలను విద్యాలయ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అన్ని తరగతుల ప్రవేశాలకు నిర్దేశిత వయస్సు 31.03.2021 నాటికి ఉండాలి. (https://kvsangathan.nic.in) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కెవిఎస్ అడ్మిషన్ గైడ్‌లైన్ ప్రకారం సీట్ల రిజర్వేషన్ ఉంటుంది. కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో అన్ని కెవిఎస్‌ల సంరక్షకులకు కాంపిటెంట్ అథారిటీ (సెంట్రల్ / స్టేట్ / లోకల్) జారీ చేసిన ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేస్తుంది.
ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పరిధిలో 1247 కెవిలు నడుస్తున్నాయి.