ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ హాస్టల్ లో 53 విద్యార్థులకు కరోనా

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ హాస్టల్ విద్యార్థులకు కరోనా సోకడంతో పరీక్షలు రద్దు చేసి, అందరికీ కరోనా పరీక్షలు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య వైద్య సదుపాయం అందిస్తున్నట్లు ఆంధ్ర విశ్వ విద్యాలయం రిజిస్టార్ వీ కృష్ణమోహన్ తెలిపారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థి అస్వస్థతకు గురికావడంతో కోవిడ్ టెస్ట్ చేయగా కరోనా బయటపడిందని. దానితో అన్ని బ్లాక్ లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 53 మందికి పాజిటివ్ గా తేలింది .ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని ఆఫ్లైన్ క్లాసులు రద్దుచేసి ఆన్లైన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.