షకీలా ఈ పేరు తెలియని వారు ఉండరు..అంతలా ఈ పేరుకు డిమాండ్ ఉంది..ఒకప్పుడు షకీలా నుండి సినిమా వస్తుందంటే చాలు బ్లాక్ లో టికెట్ కొని మరి సినిమా చూసేవారు..ఆమె ఏం చూపిస్తుందో..ఎలా చూడాలో అని అందరు ఆసక్తిగా తెర వైపు పోస్టర్స్ వైపు చూసేవారు..అంతలా షేక్ చేసింది ఇమె. ఆ తర్వాత ఏజ్ పెరగడం తో ఆమె క్రేజ్ తగ్గింది.
ప్రస్తుతం ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ నటి షకీలా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ వింగ్ లో కూడా ఆమె కీలకపాత్ర నిర్వహించబోతున్నారు. ఈమేరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ తరపున ప్రచారంతోపాటు, ప్రజలకు సేవ చేయాలనే ఉదేశ్యం తోనే తాను రాజకీయాలలోకి వస్తున్నానని షకీల అన్నారు.