దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్‌తో పాటు అసోం అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో 30, అసోంలో 47 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. బెంగాల్లో ఉదయం 9 గంటల వరకు 7.72 శాతం పోలింగ్ నమోదు నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అసోంలో ఉదయం 9 గంటల వరకు 8.84 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటుర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.