ఏపీ లో భారీగా పెరిగిన కరోనా కేసులు , కొత్తగా 984

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 8,96,863 మంది వైరస్‌ బారిన పడగా మొత్తం 4145 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 306 మంది కరోనా నుండి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 885515 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించగా మొత్తం 7203 మంది మరణించారు.