జమ్మూ-కశ్మీర్‌లో ఎల్‌ఓసీ దగ్గర నిశ్శబ్ద వాతావరణం

ఎప్పుడు బాంబు శబ్దాలతో మోతమోగే జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద దాదాపు ఐదారేళ్ల తర్వాత మొదటిసారి నిశ్శబ్ద వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే తెలిపారు. ఈ మార్చి నెలలో ఒక్కటంటే ఒక్క తూటా కూడా అక్కడ పేలలేదని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుదేశాలు పాటిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పాక్‌ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.