అప్రమత్తమైన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్న చిత్తూరు, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసుల తీవ్రత దృష్ట్యా అవసరమైన మేరకు కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేయాలన్నారు. ఆరోగ్య సర్వే చేయాలని సూచించారు. చిత్తూరు, మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా బాధితులకు 108 పడకల వార్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోనూ కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.