గుంటూరు లో కనపడని బంద్ ప్రభావం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల రద్దు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన బంద్ గుంటూరు జిల్లాలో ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ఉదయం నుంచే ప్రజలు వారి, వారి కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్సులు ఉదయం కొంతసేపు నిలిచిపోయినప్పటికీ.. 11 గంటల నుంచి తిరిగి అందుబాటులోకి వచ్చాయి. వ్యాపార సముదాయాలు సాధారణ సమయాల కంటే ఓ అరగంట ఆలస్యంగా ప్రారంభించడం మినహా బంద్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు.