బావాబామ్మర్దులు రారు

nag-venkiఈ నెల 26 బావాబామ్మర్దులు పండగ. అదేనండీ షాడో తో వెంకటేష్, గ్రీకు వీరుడు తో నాగార్జున బాక్సాఫీసు దగ్గర పోటి పడనున్నారు. అయితే ఈ పోటీ చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు లేదేమో అనిపిస్తోంది. ఈ రెండింటిలో ఒక సినిమా వచ్చే నెల3వ తేదికి మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాడో కి ధియేటర్లు సమస్య లేకపోయినా 26న విడుదల చేయాలా ? వద్దా ? అని చిత్ర బృందం తెగ ఆలోచిస్తోంది. మరోవైపు గ్రీకువీరుడు కూడా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అందుకే ఓ వారం ఆగి వద్దామని .. వీరుడు డిసైడ్ అయ్యాడట. మొత్తమ్మీద ఈ రెండిటిలో ఒక్క సినిమానే 26న చూసే ఆవకాశం ఉంది. ఈ వారం రోజుల్లో … సమస్యలన్ని తీరిపోతే తప్ప బావాబామ్మర్దుల పోరు చూసే అవకాశం లేదు.