దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టబోతోంది. దీనికోసం గత కొన్ని రోజులుగా సీనియర్ లీడర్లతో మంతనాలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 9న ఖమ్మం లో లక్ష మందితో భారీ బహిరంగ సమావేశం కు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం లో జరగబోయే ఈ సభకు పోలీసుల నుండి అనుమతి లభించింది. అయితే కోవిడ్ నిభందనలు ఖచ్చితంగా పాటించాలని తెలియచేసారు.