ఆంధ్రప్రదేశ్ లో ఇసుక ప్రైవేటీకరణను నిరసిస్తూ బిజేపి నేతలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇసుక విధానం పైన రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనీ కోరుతూ తిరుపతి ఆర్డిఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించారు. ఇసుకను కిలోల లెక్కన కరెన్సీ నొట్ల కట్టతో తూకం వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపిరాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తామని నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజల్ని ఇసుక కోసం ఎన్నో కష్టాలకు గురిచేసి ఇప్పుడు కొత్తగా నష్టాల్లో ఉన్న ఒక ప్రైవేటు సంస్థకు ఇసుక టెండర్ ఇచ్చేసి 30 లక్షల కార్మికుల కడుపుకొట్టే పనిని శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్నది అని ఆరోపించారు. బిజెపి ప్రజల తరపున నిలబడి ఈ పాలసీ వెనక్కి తీసుకునేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. అని అన్నారు.