నటీనటులు: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్‌శెట్టి తదితరులు
దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్
నిర్మాతలు: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్
మ్యూజిక్ : శ్యామ్ సీఎస్
విడుదల తేది : మార్చి 19, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5
గత కొంతకాలం గా హిట్ లేని మంచు విష్ణు..తాజాగా జెఫ్రె చిన్ డైరెక్షన్లో మోసగాళ్లు అనే సినిమా చేసాడు. తెలుగు , ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ( మార్చి 19 న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ అగర్వాల్ విష్ణు అక్కగా..సునీల్ శెట్టి ఏసీపీ కుమార్ గా నటించారు. మరి ఈ మూవీ విష్ణు కు హిట్ ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కవలలు. వీరి తండ్రి తనికెళ్ళ భరణి. నీతి, నిజాయితీకి మారుపేరు. నిజాయితీని నమ్ముకొని బ్రతికే ఆయనను ఓ వ్యక్తి మోసం చేయడంతో వీరి కుటుంబం వీధిన పడుతుంది. హైదరాబాద్ లోని ఓ స్లమ్ ఏరియాలో జీవనం సాగిస్తుంటారు. పెరిగి పెద్దయిన అర్జున్, అను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వస్తారు. అర్జున్ కాల్ సెంటర్లో పని చేస్తూ తన కుటుంబం కోసం బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. అర్జున్ కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ అక్కడి డాటా చోరీ చేస్తూ చిన్న చిన్న మోసాలకు పాల్పడుతుంటాడు. ఇతడి తెలివి తేటలు చూసి ఆ కాల్ సెంటర్ యజమాని విజయ్ (నవదీప్) ఓ ఐటి స్కామ్ కు ప్లాన్ చేస్తారు..మరి ఆ ఐటి స్కామ్ ఏంటి..? ఎలా చేశారు.. ఎందుకు చేశారు.. దాని వలన ఎవరికీ లాభం వచ్చింది.. స్కామ్ ఎలా బయటకు వచ్చింది అనేది ఈ సినిమా కథ.
ప్లస్ :
- డైరెక్షన్
- కాజల్ యాక్టింగ్
- ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్
మైనస్ :
- అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు
- సినిమా నిడివి
- ఫామిలీ సెంటిమెంట్ సన్నివేశాలు
నటీనటుల తీరు :
- కథకి తగ్గట్లుగా అర్జున్ పాత్రలో మంచు విష్ణు పర్వాలేదు అనిపించాడు.
- డీఎస్పీ కుమార్‌గా సునీల్ శెట్టి నటన బాగున్నా.. ఆయనలోని నటుడికి సవాల్ విసిరే ఒక్క సన్నివేశమూ కనిపించదు. ప్రధమార్ధంలో ఆయన పాత్రని రెండు మూడు సీన్లకే పరిమితం చేశారు.
- అను పాత్రలో కాజల్ అదరగొట్టింది. ఆ పాత్రని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దాల్సింది.
- ఇక నవీన్ చంద్ర, నవదీప్, వైవా హర్ష పాత్రలు పరిధి మేర ఆకట్టుకుంటాయి.
సాంకేతిక వర్గం :
- శ్యామ్ సీఎస్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
- ఈ చిత్రం కోసం ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని తీర్చిదిద్దిన విధానం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో థ్రిల్ చేసే మలుపులు.. ఆశ్చర్యపరిచే ఎపిసోడ్లు ఇంకొన్ని పడి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
- నిర్మాణ విలువలు పర్వాలేదు.
- ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..యదార్థ కథను రాసుకున్న మంచు విష్ణు హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ సహాయంతో ఈ సినిమాను బాగానే ప్రెజెంట్ చేశారని చెప్పుకోవాలి. సినిమా అంతా డబ్బు చుట్టే తిరుగుతూ సగటు ప్రేక్షకుడికి బాగానే కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మధ్య తరగతి వ్యక్తి వేల కోట్ల రూపాయల స్కామ్ ఎలా చేశాడో చూపిస్తూ కథను ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్. నేటి ప్రపంచంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలను, వాటి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపించిన విధానం ఆకట్టుకుంది. కాకపోతే సినిమా రన్ టైం కాస్త చూసుకునే బాగుండేది.
ఓవరాల్ గా : థ్రిల్ లేని మోసాలు