తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేసారు. గతేడాది రూ.25 వేల రుణాలను మాఫీ చేశామని.. వంద శాతం రైతుల రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.
అలాగే రుణాలపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. 2014లో తెలంగాణలో 12.23 లక్షల ఎకరాలు సాగులో ఉందని.. ప్రస్తుతం 58 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని కేసీఆర్ తెలిపారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమని కేసీఆర్ అన్నారు.