ఎన్టీఆర్‌కి ఈ వాచీ సెంటిమెంట్ ఏమిటో…

NTR-Watch-Sentimentచిత్ర సీమలో కొన్ని సెంటిమెంట్లు బ‌హు విచిత్రంగా ఉంటాయ్‌…, ఎన్టీఆర్‌కీ సెంటిమెంట్ ఉంది. త‌న దర్శకులందరికీ వాచీలు ఇచ్చి మ‌చ్చిక చేసుకొంటుంటాడు. బాద్‌షా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో శ్రీ‌నువైట్ల ఓ వాచీ ప్రెజంట్ చేశాడు. అది మామూలు వాచీ కాదు. స్విజ్జర్ లాండ్ నుంచి దిగుమ‌తి చేసిన వాచీ. దాని విలువ రూ.12 లక్షలు. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆయ‌న‌కీ అలాంటి వాచీనే బ‌హుమ‌తిగా అందించాడు. వాచీ ఇచ్చి.. బుట్టలో వేసుకొందామ‌నా? లేదంటే అంద‌రికీ మంచి టైమ్ క‌ల‌సి రావాల‌నా?? ఈ సెంటిమెంట్ ఏమోగానీ… ఎన్టీఆర్ ఇచ్చిన వాచీ చూసి హ‌రీష్ శంక‌ర్ తెగ పొంగిపోతున్నాడు. ఓ హిట్ ఇచ్చి… ప్రతిఫలం సమ‌ర్పించుకొంటాడేమో? ఎన్టీఆర్‌కీ కావ‌ల్సింది అదే క‌దా?