మహిళా ప్రాణం తీసిన కోతుల గుంపు

కోతుల అంటే కొంతమందికి ఇష్టం..మరికొంతమందికి భయం. వాటిని మనం ఏమి అనకపోతే అవి కూడా ఏమి అనవు. కానీ ఒక్కోసారి అవి ఏమ్చేస్తాయో అనే భయమే మనల్ని ప్రాణం మీదకు తీస్తాయి. తాజాగా అలాంటి భయమే ఓ మహిళా ప్రాణం పోయేలా చేసింది. కోతుల గుంపు చూసి అవి ఎక్కడ తనపై దాడి చేస్తాయో అని భయపడి ప్రాణం వదిలింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన బట్టపల్లి మోహన్‌ ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ధర్మారానికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మోహన్‌ కూతురు రేవతి (34)కి వివాహం అయినప్పటికీ తండ్రి వద్దనే ఉంటోంది. ఉదయం ఇంటి నుంచి రేవతి బయటకు వస్తున్న సమయంలో గుంపుగా వచ్చిన కోతులు పెద్దగా అరుస్తూ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వాటిని చూసిన రేవతి భయంతో అక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పారు.