బ్యాంకు ఖాతాదారులు గమనించగలరు ..ఈరోజు , రేపు బ్యాంకులు బంద్. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇప్పటికే మొన్న రెండో శనివారం, నిన్న ఆదివారం కావడం తో రెండు రోజులు బ్యాంకులకు సెలవులు కాగా ఈరోజు , రేపు కూడా బ్యాంకులు బంద్ కావడం తో ఖాతాదారులకు తిప్పలు తప్పడం లేదు.
దాదాపు పది లక్షల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావమే కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి వివిధ బ్యాంకుల శాఖల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్‌ల క్లియరెన్స్, రుణ దరఖాస్తులకు ఆమోదం వంటి సేవలు స్తంభించనున్నాయి.