‘రౌడీ బేబీ’పేరు మార్చేస్తున్నారు

సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా రూపొందుతున్న చిత్రం ‘రౌడీ బేబీ’.  ఐతే ఈ చిత్రం టైటిల్ మార్చుతున్నట్టు నిర్మాత కోన వెంకట్ వెల్లడించారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా టైటిల్ మార్పు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, కొత్త టైటిల్ మరింత ఆసక్తికరంగా ఉండనుందనిచెప్పారు.

“కొన్ని మార్పులు ఆహ్లాదకరంగా, ఎంతో బాగుంటాయి. మేం వెల్లడించబోయే ఉద్విగ్నభరితమైన కొత్త టైటిల్ కోసం వేచిచూడండి. దాంతోపాటే అప్ డేటెట్ లుక్, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం” అని కోన వెంకట్ వివరించారు.

కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ బ్యానర్ పై ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.