రివ్యూ : ఉమ్మడి వ్యవసాయానికి ‘శ్రీకారం’

నటీనటులు :  శర్వానంద్, ప్రియాంకా అరుళ్‌ మోహన్, సాయికుమార్‌, మురళీ శర్మ, రావు రమేశ్‌ తదిరులు
నిర్మాణ సంస్థ : 14 రీల్స్‌ ప్లస్‌
సంగీతం : మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ : జే యువరాజ్‌
నిర్మాతలు : రామ్‌ ఆచంట, గోపీ ఆచంట
దర్శకత్వం : బి.కిశోర్‌
తెలుగుమిర్చి రేటింగ్: 2.5/5

శర్వానంద్ మంచి నటుడు. ఏ పాత్రనైనా చేయగలడు. ఎమోషనల్ పాత్రలు ఐతే కొట్టిన పిండి. చివరికి జాను అనే అనే లవ్ స్టొరీ చేశాడు. తమిళ్ లో విజయం సాధించినంతగా ఈ సినిమా తెలుగులో ఆడలేదు. ఇప్పుడు జోనర్ మార్చాడు. వ్యవసాయం నేపధ్యంలో ఓ సందేశాత్మక సినిమా చేశాడు. అదే శ్రీకారం. ఈ సినిమా ఎలా వుందో ఓ లుక్ వేద్దాం.

కధ:
కార్తీక్ (శర్వానంద్) ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్.  తండ్రి కేశవులు(రావు రమేష్) ఓ రైతు. దిగుమ మధ్యతరగతి కుటుంబం. ఐతే కార్తిక్ చదువుకొని మంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుతాడు. చైత్ర(ప్రియాంకా అరుళ్‌ మోహన్) కార్తిక్ ని ఇష్టపడుతుంది. కార్తిక్ మాత్రం వర్క్ మైండెడ్.  ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం కార్తిని  అమెరికా పంపించేందుకు డిసైడ్ అవుతుంది. కానీ కార్తీక్ మాత్రం ఉద్యోగం మానేసి వ్యసాయం చేయడానికి తన గ్రామానికి వెళ్తాడు.  కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు. అసలు కార్తిక్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్‌ ఎలా పరిష్కరించాడు? అనేది మిగిలిన కధ.

ఎలావుంది:
చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తే ఎంత లాభం ఉంటుందో తెలియజేసే కథే ‘శ్రీకారం’. వ్యవసాయం, రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్‌. కష్టంపడి పనిచేసి పంటను పండించిన రైతు.. తన పంటను అమ్ముకోలేక ఎంతటి కష్టాలు పడుతాడో ఈ  సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు.. వారిని ఎలా పీక్కుతింటారనేది వాస్తవానికి దగ్గరగా చూపించాడు. వ్యవసాయం దండుగ అనుకునే రోజులివి. లాయర్ కొడుకు లాయర్ అవుతాడు కానీ రైతు కొడుకు రైతుకావాలని కలలో కూడా అనుకోడు. దీనికి కారణాలు చెప్పుకుంటే తెల్లారిపోద్ది. పాయింట్ లోకి వచ్చేస్తే.. వ్యవసాయం దండుగ అని వదిలేసిన కొంత మంది రైతులతో వ్యవసాయం పండగ అని నిరూపించడానికి చేసిన ప్రయత్నం శ్రీకారం.

ఐతే సినిమా అనేది ఓ కొత్త ఎక్స్ పిరియన్స్ ని ఇవ్వాలి. శ్రీకారం కొత్తదనం పంచడంలో మాత్రం విఫలమైయింది. ఆల్రెడీ తెలిసిన కష్టాలు, చూసిన బాధలు, చెప్పిన డైలాగులు మళ్ళీ మళ్ళీ చూసినట్లు చెప్పినట్లు అనిస్తాది శ్రీకారంలో. పైగా సినిమా వేగం కూడా చాలా నెమ్మదిగా వుంటుంది. ప్రతి సీన్ కూడా ప్రేక్షకుడి ఊహకు ముందే అందిపోతుంది. రైతుల కష్టాల పై చాలా సినిమాలు వచ్చాయి. శర్వానంద్ లాంటి హీరో చేస్తున్నాడు కదా కొత్తదనం ఉటుందని ఆశిస్తే మాత్రం పూర్తిగా నిరాశ చెందినట్లే.  

ఎవరెలా చేశారు ?
శర్వానంద్‌ కు ఫల్ మార్కులు పడతాయి.  రైతు కుటుంబానికి చెందిన కార్తిక్‌ పాత్రలో శర్వానంద్‌ ఒదిగిపోయాడు. తనకు ఉన్న అనుభవంతో కొన్ని ఎమోషనల్‌ సీన్లను కూడా చక్కగా పండించాడు. కథనంతా తన భూజాన వేసుకొని నడిపించాడు.  చైత్ర పాత్రలో ప్రియాంకా అరుళ్‌ మోహన్ మెప్పించింది.  నిరుపేద రైతు కేశవులు పాత్రలో రావు రమేశ్‌ ఒదిగిపోయాడు.  సాయి కుమార్‌ , ఆమని , నరేశ్‌, మురళి శర్మ, సత్య తదితరులు తమ  పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ గా సినిమా బాగానే వుంది.  మిక్కీ జె. మేయర్ సంగీతంకు యావరేజ్ మార్కులు పడతాయి. కెమరాపనితనం బావుంది. నిర్మాణ విలువలు ఓకే.

ప్లస్‌ పాయింట్స్‌
శర్వానంద్‌ నటన
కొన్ని ఎమోషనల్ సీన్స్  

మైనస్‌ పాయింట్స్‌
రొటీన్‌ స్టోరీ
స్లో నేరేషన్‌
సెకండ్ హాఫ్ ల్యాగ్

ఫైనల్ గా.. ఉమ్మడి వ్యవసాయానికి ‘శ్రీకారం’