నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు తదితరులు
దర్శకత్వం : అనీష్
నిర్మాతలు: ఎస్. క్రిష్ణ
మ్యూజిక్ : అచ్చురాజమణి
విడుదల తేది : మార్చి 11, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5
హీరో శ్రీ విష్ణు హీరోగా అనిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాలి సంపత్. మహా శివరాత్రి కానుకగా ఈరోజు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో పోషించగా..దర్శకుడు అనిల్ రావిపుడి దర్శక పర్యవేక్షకుడిగానే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించడం తో ఈ మూవీ ఫై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా అనేది చూద్దాం.
కథ :
రేడియో జాకీ గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్)కు నాటకాలు అంటే ఎంతో ఇష్టం. ఓ యాక్సిడెంట్లో తన గొంతును పోగొట్టుకుంటాడు. భార్య అకాల మరణం చెందడంతో కొడుకు సూరి (శ్రీ విష్ణు) కోసం జీవిస్తుంటాడు. అరకులో ఓ ట్రక్కు కొనుక్కొని జీవితం గడిపేయాలనే ఆలోచనలో సూరి ఉంటారు. ఈ క్రమంలో అదే ఊరిలోని సర్పంచ్ కూతురు పాప (లవ్లీ సింగ్)తో ప్రేమలో పడుతాడు. అయితే తండ్రి కారణంగా తన పెళ్లికి అడ్డంకులు ఏర్పడటంతో సూరి మనస్తాపానికి గురి అవుతారు. ఈ తరుణంలోనే ఇంటిముందు ఉన్న నూతిలో సంపత్ పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? అనేది కథ.
ప్లస్ :
- రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్
- సినిమాటోగ్రఫి
- అక్కడక్కడా కొన్ని సీన్లు
మైనస్ :
- నాసిరకం కథ , బోరింగ్ సన్నివేశాలు
- కొత్తదనం లేని లవ్ ట్రాక్
- ఫస్ట్ హాఫ్
నటీనటుల తీరు
- గాలి సంపత్ గా రాజేంద్రప్రసాద్ మరోసారితన నటన తో ఆకట్టుకున్నాడు.
- శ్రీ విష్ణు ఎప్పటిలాగానే తన పరిధిలో మెప్పించాడు.
- ఇక సంపత్ గ్యాంగ్ లో సత్య, సురేంద్రరెడ్డి నవ్వించే ప్రయత్నం చేశారు. శ్రీనివాసరెడ్డి కామెడీ… సపరేట్ ట్రాక్ లా అనిపించినా, కథలోని మలుపులకు అతని పాత్ర పరోక్షంగా ఉపయోగపడుతుంది. హీరోయిన్ లవ్లీ సింగ్ అందంతో ఆకట్టుకుంది. అంతకు మించి ఆమె పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఏమీ లేదు.
సాంకేతిక వర్గం :
*సాయి శ్రీరాం తన సినిమాటోగ్రఫితో ఆకట్టుకొన్నాడు. అరకు అందాలను తన కెమెరాలో అద్భుతంగా పట్టుకొన్నాడు.
- అచు రాజమణి సంగీతం విషయానికి వస్తే..రీరికార్డింగ్ బాగుంది. ఓ పాట ఫర్వాలేదనిపిస్తుంది.
- ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు ఓకే అనిపించేలా ఉంది.
- ప్రొడక్షన్ వాల్యూస్ ఓ మోస్తారుగా ఉన్నాయి.
- డైరెక్టర్ విషయానికి వస్తే.. రాజేంద్ర ప్రసాద్ పాత్రను, శ్రీ విష్ణు లవ్ ఎపిసోడ్‌ను మరింత ప్రభావవంతంగా తెరకెక్కించి ఉంటే తప్పకుండా ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీగా మారి ఉండేది. అలాంటి అవకాశాన్నిపోగొట్టుకున్నాడు. కథ కూడా పెద్దగా రాసుకోలేదు. సెకండ్ హాఫ్ దారుణంగా ఉంది.
ఫైనల్ :
గాలి సంపత్…గాలితీసాడు