భారత్‌లో మళ్లీ భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

భారత్‌లో కోవిడ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 22,854 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా, 126 మంది మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో కోవిడ్ నుండి 18,100 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు భారత్‌లో 1,12,85,561కు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా మొత్తం 1,09,38,146 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో 1,58,189 మంది కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.