షారుక్ గర్వపడే క్షణం !

sharukభారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని దిలీప్ కుమార్, అమితాబచ్చన్, షారుక్ లతో రూపొందించిన ‘ఫిలిమ్ ఫేర్’ కవర్ మ్యాగజైన్ ఈ రోజు ముంబయిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ.. తను హీరోగా నటించిన చిత్రాలను భవిష్యత్ లో ఎవరో ఒకరు రీమేక్ చేస్తారని, అప్పుడే తాను విజయం సాధించినట్లు అని, అదే తన జీవితంలో గర్వంగా భావించే క్షణమని తన మనసులో మాట చెప్పాడు బాలీవుడ్ బాద్షా. కవర్ పేజ్ పై దిలీప్, అమితాబ్ ల సరసన తాను ఉండడంతో తన జీవితం సంపూర్ణమయిందని అన్నాడు.