‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఎ.వీరవరంలో రామ్చరణ్ దంపతులు సందడి చేశారు. సినిమా చిత్రీకరణ నేపథ్యంలో ఎ.వీరవరం, కొత్త అంగుళూరు వద్ద గోదావరి ఒడ్డున ‘ఆచార్య’ పాట చిత్రీకరణ చేశారు. దీంతో రామ్చరణ్ను చూడటానికి అభిమానులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు.
దేవీపట్నంలోని పాఠశాల విద్యార్థులతో రామ్చరణ్ సతీమణి ఉపాసన ముచ్చటించారు. దేవీపట్నం వచ్చిన ఆమె తొయ్యేరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు ఆమెతో సెల్ఫీలు దిగారు. ‘ఆచార్య’లో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, రామ్చరణ్ కామ్రేడ్ సిద్ధ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే, రామ్చరణ్లపై ఓ పాటని మారేడుమిల్లిలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరిస్తున్నారు.