లాక్ డౌన్ కి ముందే `వైల్డ్ డాగ్` సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు నాగార్జున. కరోనా కారణంగా ఇది ఓటీటీ రిలీజ్ అని డీల్ సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ రిలీజ్ కి షిఫ్ట్ అయ్యింది. ఓటీటీ కి దాదాపు అమ్మేసిన ఈ సినిమాని బయటకు లాక్కురావడం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. నాగ్ ఈ సినిమా ని రీసెంట్ గా చూడటం ఆయని నచ్చడం థియేటర్ రిలీజ్ కి ప్లాన్ చేయడం, నిర్మాతలు నెట్ ఫ్లిక్ష్ తో ఒప్పందం రద్దు చేసుకోవడం చకచక జరిగిపోయింది.
వైల్డ్ డాగ్ లాంటి సినిమాలు థియేటర్లో చూడడం సబబే. కాకపోతే.. మార్కెట్ పరంగా ఆలోచిస్తే, ఈ నిర్ణయం కొంత రిస్క్ వుంది. నెట్ ఫ్లిక్స్ ఈసినిమాని దాదాపుగా 35 కోట్లకు కొనుగోలు చేయాలనిచూసిందని టాక్. నాగ్ సినిమా హిట్ అయితే ఈ రేంజ్ వసుళ్ళూ వస్తాయి. కానీ నాగ్ సినిమాలు ఈమధ్య బాక్సాఫీసు దగ్గర సరైన ప్రభావం చూపించలేకపోయాయి.
`వైల్డ్ డాగ్` కూడా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా కాదు. అదో యాక్షన్ డ్రామా. సినిమా హిట్టయి బాగుంది అనే టాక్ వస్తే తప్ప, ఈ సినిమా క్రౌడ్ పుల్లర్ కాదు. ఓటీటీకి అమ్మేసినా, మిగిలిన శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఉంటాయి. ఏ రకంగా చూసినా.. ఇది మంచి డీలే. కానీ నాగ్ మాత్రం కొంత రిస్క్ చేసే ఆ నిర్ణయం తీసుకున్నాడనే కామెంట్స్ ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి.