కోన దృష్టి వాటిపై పడింది..

ప్రముఖ రైటర్ , నిర్మాత కోన వెంకట్ దృష్టి అక్రమ కట్టడాల ఫై పడింది. హైదరాబాద్ లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాల ఫై ట్విట్టర్ వేదిక గా మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లేలా ట్వీట్ చేసాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని సయ్యద్ నగర్ లో ఎన్నో ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్స్ జరగుతున్నాయి.

మురుగు నీరు లేదు పారిశుధ్యం లేదు రోడ్లు లేవు. భవిష్యత్తులో ఈ మురికివాడల్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు మేజర్ ప్రాబ్లమ్స్ కు దారి తీసే అవకాశం ఉంది. దయచేసి దీనిని పరిశీలించండి” అంటూ మంత్రి కేటీఆర్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ ను ట్యాగ్ చేశారు. మరి ఈ ట్వీట్ ఫై వారు ఎలా స్పందిస్తారనేది చూడాలి.