రాఘవేంద్రరావు తీసిన సూపర్ డూపర్ హిట్లలో.. పెళ్లి సందడి ఒకటి. ఈ సినిమాతో శ్రీకాంత్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తో నయా `పెళ్లి సందడి`కి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి దర్శకత్వం వహిస్తోంది. రాఘేవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణకు పరిమితమయ్యారు.
అయితే.. ఇప్పుడు విషయం ఏమిటంటే… ఈ సినిమాలో హీరో రోషన్ కాదు. రాఘవేంద్రరావే. ఆయన కోణంలోనే కథ నడుస్తుందని తెలుస్తోంది. రాఘవేంద్రరావు యవ్వనంలో ఉండే పాత్రని రోషన్ పోషిస్తున్నాడట. అంటే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ రాఘవేంద్రరావు వుంటారు. ఆయన కోణంలోనే సినిమా సాగుతుంది.
శతాధిక చిత్రాల దర్శకుడిగా రాఘవేంద్రరావు కీర్తి గడించారు. ఇప్పుడాయనకు నటనపై ఆసక్తి కలగడం ఆసక్తికరం. ఇది వరకూ ఆయన కనీసం మాట్లాడేవారు కాదు. ఓ బుల్లి తెర కార్యక్రమం పెట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన నటించడం ఇండస్ట్రీ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.