సుమంత్ చెప్పిన ‘దేశముదురు’ అసలు కధ

ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకి వెళ్ళిపోతుంది. ఇందులో కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులు వుంటాయి. తాజాగా హీరో సుమంత్ ఇలాంటి ఓ సంగతి చెప్పాడు.   ఓ సూపర్‌హిట్‌ ప్రాజెక్ట్‌ గురించి పూరీ జగన్నాథ్‌ మొట్టమొదట తననే సంప్రదించారని వెల్లడించాడు సుమంత్‌. అక్కినేని కుటుంబానికి చెందిన సుమంత్‌   ఇప్పటివరకూ ఆయన దాదాపు 25 చిత్రాల్లో నటించారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కపటధారి’. కన్నడ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ‘కపటధారి’ ప్రమోషన్‌లో భాగంగా  సుమంత్‌ ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఓ సంగతి చెప్పాడు.

‘ఓసారి  దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నన్ను సంప్రదించారు. మాస్‌, కమర్షియల్‌ హంగులున్న కథ చెప్పారు. కథ నాకెంతో నచ్చింది. కానీ అది నాకు సెట్‌ కాదు. దాంతో నేను సున్నితంగా తిరస్కరించాను. ఆ తర్వాత పూరీ.. అల్లు అర్జున్‌ని సంప్రదించారు. అలా వాళ్లిద్దరూ కాంబోలో ‘దేశముదురు’ తెరకెక్కింది. ఒకవేళ నేనే కనుక ఆ సినిమా చేసి ఉంటే తప్పకుండా ఫ్లాప్‌ అయి ఉండేది. బన్నీ చేశాడు కాబట్టే అది హిట్‌ అయ్యింది.’’ అని నిర్మొహమాటంగా చెప్పాడు సుమంత్‌. ఏదేమైనా సుమంత్ చాలా జెన్యూన్ గా నిజాయితీగా మాట్లాడాడని చెప్పొచ్చు. కొంతమంది ఐతే అదే సినిమా నేను చేసి వుంటే నా కెరీర్ మరో స్థాయిలో వుండేదని చెప్తారు. కానీ సుమంత్ మాత్రం వున్నది వున్నట్లుగా చెప్పి షభాష్ అనిపించుకున్నాడు