నటీనటులు: సుమంత్, నందితా శ్వేత, నాజర్, జయప్రకాష్ తదితరులు
దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి
నిర్మాతలు: లలిత ధనంజయన్
మ్యూజిక్ : సైమన్ కింగ్
విడుదల తేది : ఫిబ్రవరి 19, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5
సుబ్రహ్మణ్యపురం చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న సుమంత్..ఈరోజు (ఫిబ్రవరి 19) కపటధారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తుండగా, క్రియేటివ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ధనంజయన్ నిర్మించారు. కన్నడలో ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. కన్నడలో చాలా పెద్ద హిట్ అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్‌ను తెలుగు, తమిళ భాషల్లో.. రీమేక్ అయ్యింది. సుమంత్, నందిత జంటగా నటిస్తుండగా.. పూజాకుమార్, నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మరి కన్నడ లో పెద్ద హిట్ అయినా ఈ మూవీ తెలుగు లో ఎలా ఉంది..? ఈ కథ ఏంటి..? సుమంత్ రోల్ ఏంటి..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.
కథ :
గౌతమ్ (సుమంత్) హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. కానీ గౌతమ్‌కి ట్రాఫిక్ నుంచి క్రైమ్ డిపార్ట్మెంట్లో వెళ్లాలనే కోరిక. ఓ రోజు అనుకోకుండా మెట్రో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో మూడు అస్థి పంజరాలు బయటపడతాయి. మూడు అస్థి పంజరాల్లో ఓ పదేళ్ల పాప అస్థి పంజరం కూడా ఉండడం గౌతమ్‌కి చాలా బాధ వేస్తుంది. అభం శుభం తెలియని ఓ పదేళ్ల పాపను ఎవరు చంపారో తెలుసుకోవాలని అనుకుంటాడు. పై అధికారికి ఇష్టం లేకపోయినా క్రైమ్ కేసులో గౌతమ్ ఎంటర్ అవుతాడు. మరి ఆ అస్థి పంజరాలు ఎవరివి..? గౌతమ్ ఈ కేసును ఎలా ఛేదిస్తాడు..? అనేది సినిమా కథ.
ప్లస్ :
- సుమంత్ యాక్టింగ్
- ఇంట్రస్టింగ్ సన్నివేశాలు
- నేపధ్య సంగీతం
మైనస్ :
- లాజిక్ లు మిస్ అవ్వడం
- ఎడిటింగ్
- స్క్రిన్ ప్లే
- స్లో కథ
నటీనటుల తీరు :
- సుమంత్ చాల ఈజీ గా తన రోల్ ను చేసాడు. తనదైన నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.
- రంజిత్‌గా నాజర్, జీకేగా జయప్రకాశ్ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
- నందితా శ్వేత ఈ సినిమాలో పాత్రను ఎందుకు ఒప్పుకొన్నారనే విషయం ఓ పట్టాన అర్థం కాదు. ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్రలో నందిత కనిపించారు.
- విలన్‌గా ఆలేరు శ్రీనివాస్‌గా నటించిన వ్యక్తి కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు.
- ఇక ఇతర పాత్రలో నటించిన వారంతా వారి వారి పాత్రలో ఓకే అనిపించారు సాంకేతిక వర్గం :
- సైమన్ కింగ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో మాంటేజ్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.
- దర్శకుడు ఎంచుకొన్న స్క్రీన్ ప్లే కారణంగా ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ విషయంలో ప్రతిభను చాటుకోలేకపోయారు.
- రాసమతి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది.
- డైరెక్టర్ విషయానికి వస్తే..కన్నడ లో సూపర్ హిట్ సాధించిన కావలుధారి ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తెరకెక్కించలేకపోయారు. చాల లాజిక్ లు మిస్ అయ్యాడు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టాల్సి ఉండాల్సింది. స్క్రిన్ ప్లే టిపికల్‌గా ఉండటం కూడా కథ గమనానికి అడ్డుగా మారింది. నటి నటులను కూడా పూర్తిగా వాడుకోలేకపోయాడు.