బాల నటుడిగా ఆకట్టుకున్నాడు పూరి తనయుడు ఆకాష్. తర్వాత హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆంద్ర పోరి అనే సినిమా చేశాడు. ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. వయసు కూడా పెద్దదిగా లేకపోవడంతో నిబ్బా సినిమాగా మిగిలిపోయింది ఆంద్రపోరి.
ఐతే ఎలాగైనా హీరోగా నిలబెట్టాలనే లక్ష్యంతో పూరినే ఓ కధ రాసుకొని `మెహబూబా` సినిమాతో హీరోగా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆ సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. తర్వాత `రొమాంటిక్` సినిమా చేశాడు. అది ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా పట్టాలెక్కించేశాడు. అదే.. `చోర్ బజార్`.
`జార్జ్‌రెడ్డి` దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. వి.ఎన్.రాజు నిర్మాత ఇందులో యాక్షన్, లవ్, సెంటిమెంట్, వినోదం… ఇవన్నీ ఇందులో పుష్కలంగా జోడించార్ట. క్రైమ్ కామెడీ జోనర్లో సాగే సినిమా ఇది. హీరోగా నిలబడాలంటే ఆకాష్ కి ఓ హిట్ అవసరం. ఆ హిట్ `చోర్ బజార్`తో వస్తుందని ఆశగా వున్నాడు ఆకాష్. మరి చూడాలి ఈ `చోర్ బజార్` ముచ్చట్లు.