సినిమాల్లో నటించే వాళ్ళకు దర్శకత్వం చేయాలనే కోరిక కూడా వుంటుంది. ఇలా ఎంతో మంది నటులు దర్శకులుగా మారారు. ఐతే సినిమా నిర్మాణం మాత్రం ఇందుకు భిన్నం. నటుడు దర్శకులు నిర్మాణం జోలికి వెళ్ళిన సందర్భాలు మాత్రం తక్కువ. అందులో మహిళా స్టార్స్ ఐతే ఈ నిర్మాణం అంటే వెనక్కి జరుగుతారు. గతంలో సావిత్రి, విజయ నిర్మల లాంటి నటీమణులు నిర్మాణాలు చేశారు. ఐతే ఈ మద్య కాలంలో అది తగ్గింది. దానికి జోలికి వెళ్ళే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఐతే ఇప్పుడో హీరోయిన్ నిర్మాణంను భుజానికి ఎత్తుకుంది.
చిన్నారి పిల్లి కూతుర్రు ఫేం అవికా గోర్ కూడా నిర్మాతగా మారుతుంది. . ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో బుల్లితెర వీక్షకులను… ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన సినిమాల్లో కథానాయిక నటించిన అవికా గోర్ తెలుగు ఆకట్టుకుంది. ఇప్పుడు అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ మొదలు పెట్టింది. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం3 రూపొందుతోంది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్. సాయి రోనక్ హీరో. ఈ చిత్రానికి ఎం.ఎస్. చలపతి రాజు సహ నిర్మాత. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం. మొత్తానికి నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది అవికా. మరి చూడాలి ఆమెకు ఈ జర్నీ ఎలా కలిసొస్తుందో..