సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ప్రేమికుల రోజుకు సరైన నిర్వచనం ఇస్తూ ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదలైంది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘డార్లింగ్’ చిత్రాల తర్వాత ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా టీజర్ కోసం అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ‘రాధేశ్యామ్’ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.
ఐతే ఒక టీజర్ కట్ చేసినప్పుడు అందులో చుపించిన ప్రతి డీటెయిల్ పై ప్రత్యేకమైన ఫోకస్ వుంటుంది. ఈ టీజర్ లో ప్రతి షాట్ ని గమనిస్తే ఓ బ్లాక్ అమ్మాయి పై క్లోజప్ వేయడం ప్రత్యేకంగా ఆకర్షించింది. బేసిగ్గా ఒక టీజర్ లో క్లోజప్ వేస్తె దానికి ఒక ప్రత్యేకమైన ప్రాధన్యత కధలో వుంటుంది. ఈ టీజర్ మొత్తంలో ప్రభాస్, పూజా తో పాటు ఓ అమ్మాయి పై కూడా క్లోజప్ షాట్ వేయడం పరిశీలకుల ద్రుష్టిని ఆకర్షించింది. అంతేకాదు ప్రభాస్ ఇటలీ భాషలో ”ఓ నా దేవత’ అని పిలిచిన తర్వాత ఆమె క్లోజప్ లో రివిల్ కావడం ఒక్కింత ఆసక్తికరంగా వుంది. ఇది మామూలు మాంటేజ్ షాట్ నా లేదా దీనికి కధలో ప్రత్యేకమైన పాత్ర ఏదైనా ఉందా అనేది రాధే శ్యామ్ చుస్తే తెలుస్తుంది.