ఏపీలో రెండో విడత స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 6:30 నిమిషాలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 3.30గంటల వరకు కొనసాగనుంది. రెండో విడత గ్రామాల్లో మొత్తంగా 2,786 గ్రామ పంచాయతీ సర్పంచి స్థానాలకు గానూ 7,507 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 33,570 వార్డులకు గానూ 12,604 ఏకగ్రీవమయ్యాయి.
మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం 44,876 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. తొలి రెండు గంటల్లో పోలింగ్ 10.28 శాతం నమోదైంది. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.