‘వైఎస్ ఆత్మ’కు కష్టాలు.. !

kvp-in-troubleవైఎస్ ఆత్మగా పిలవబడే కెవిపి రామచంద్రా రావు పై కూడా సీబీఐ ఉచ్చుబిగించనుందా..? తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ హయాంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్ లు, పారిశ్రామిక వేత్తలు, న్యాయవాదులు ఇలా అందరూ కెవిపి అనుమతితోనే ముఖ్యమంత్రిని కలిసేవారని, ఏ డీలైనా.. కెవిపి కనుసన్నుల్లోనే జరిగేవనేది అందరి నోట వినబడే మాట!

అయితే మంగళవారం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కేవీపీకి ఉన్న సంబంధాలపై సీబీఐ కోర్టు సీబీఐని ప్రశ్నించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు వాంగ్మూలాన్ని మంగళవారం సీబీఐ న్యాయస్థానానికి సమర్పించింది. ఈ వాగ్మూలంలో.. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో డీల్స్ అన్ని కెవిపి రామచంద్ర రావు ఆమోదం పొందిన తర్వాతనే ఫైనలైజ్ అయ్యేవని సూరీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో. సూరీడు వాంగ్మూలం ఆధారంగా కేవీపీ గురించి సీబీఐ ఏమి తెలుసుకున్నారని? న్యాయస్థానం ప్రశ్నించినట్లుగా.. విచారణ కొనసాగిస్తున్నామని కేవలం వాగ్మూలం ఆధారం ధోషులుగా తేల్చలేమని, సాక్షాలను సేకరించే పనిలో ఉన్నటు సీబీఐ న్యాయస్థానానికి వివరించినట్ల తెలుస్తోంది.

ఇప్పటికే వైఎస్ కేబినేట్ లో మంత్రులందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు మంత్రులు జైలుల్లో ఉన్నారు. మరికొందరు జైలుకు వెళ్లడానికి రెడీగా ఉన్నారు. తాజాగా సూరీడు వాగ్మూలంతో వైఎస్ ఆత్మగా పేర్కొనబడే కెవిపి రామంచంద్రా రావు కూడా జైలు గడపక తొక్కక తప్పదనే వార్తలు ఊపందుకున్నాయి.