డేంజర్ జోన్ లో టీమ్‌ఇండియా.. విరాట్ వాట్ నెక్స్ట్


నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు ఊహించని ఆరంభం దక్కింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ చేతిలో 227 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ జట్టు  ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ ఓటమితో అందరి చూపు విరాట్ పై పడింది. కెప్టెన్సీలో కోహ్లీ వరుసగా నాలుగు టెస్టుల్లో ఓటములు చవి చూశాడు విరాట్. న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టు, చెన్నై వేదికగా జరిగిన ఇంగ్లాండ్ టెస్టులో పరాజయాన్ని చవిచూశాడు.

అంతేకాదు ఈ  పరాజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ర్యాంకు మరింత దిగజారింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో కోహ్లీసేన ర్యాంకు నాలుగుకు చేరుకుంది.  టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే టీమిండియా.. ఇంగ్లాండ్ సిరీస్‌ను కనీసం 2-1 తేడాతో విజయం సాధించాలి. ఈ నేపథ్యంలో కోహ్లీ  మరింత ఒత్తిడి పెరిందని చెప్పాలి. మరి మిగతా మ్యాచ్ లకు విరాట దగ్గర వున్న గేమ్ ప్లాన్ ఏంటో చూడాలి.