ఉప్పెన ఫ్లాఫ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా ?

సినిమాపై హైప్ పెంచడానికి ఒక్క పాట చాలు. కొలవరి డీ పాటతో ‘3’ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మద్య కాలంలో ముఫ్ఫై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో కూడా నీలి నీలి ఆకాశం పాట సూపర్ హిట్ అయ్యింది. ఉప్పెన సినిమాలో కూడా ఇలాంటి పాట ఒకటి వుంది.   నీ కళ్ళు నీలి సముద్రం పాట కూడా కొత్త రికార్డు నమోదు చేసింది.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ఇందులో నీకళ్ళు పాట యువత ను ఉర్రూత లూగించింది.

అయితే ఈ సినిమాకి సంబధించిన లేటెస్ట్ టాక్ ఏమిటంటే స్వయంగా నిర్మాతలే సినిమాని విడుదల చేసుకుంటున్నారు. బేసిగ్గా  సినిమాకు మాంచి బజ్ వస్తే..  అమ్మేసి చేతులు దులుపుకుందాం అనుకుంటారు నిర్మాతలు. ఇంకా ఎక్కువ నమ్మకం వుంటే  రేటు పెంచుతారు. కానీ ఈ రెండూ కాకుండా తామే విడుదల చేసుకుందాం అని డిసైడవ్వడం డేరింగ్ స్టెప్ అనుకోవాలి. ఈ సినిమా పాట జనాల్లోకి వెళ్ళిపోయింది. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. ట్రైలర్ కూడా ప్రామెసింగ్ గా వుంది. ఈ నమ్మకంతో స్వయంగా నిర్మాతలే రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే పాట హిట్ అయి,  సినిమా ఫట్ అయిన సినిమాలు బోలెడు. 3, ముఫ్ఫై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలు కూడా ఇలానే ఫట్ అన్నాయ్. అయితే ఉప్పెన ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలనే కోరుకుందాం.