అనసూయకే ఎందుకిలా జరుగుతుంది ?

సోషల్ మీడియా ఎంత మంచో అంత చెడు. సోషల్ మీడియాని మరీ అంత పర్శనల్ గా తీసుకుంటే ఇక్కడ వుండటం కష్టం. చాలా మంది సెలబ్రిటీలు మొదట చాలా ఎమోషనల్ గా ఫీలై తర్వాత ఈ  మీడియాని అర్ధం చేసుకొని ఇక్కడ ఎవడు ఎలాంటి కామెంట్లు పెట్టినా లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు.కానీ కొంతమంది నెగిటివ్ కామెంట్ వస్తే మటుకు ఫాలోవర్స్ కి,  నెటిజన్స్ కు  లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. ఈ లిస్టు లో యాంకర్ అనసూయ కూడా వుంది. నెలకి ఒకసారైన అనసూయ సోషల్ మీడియాలో ఒక ఇష్యూవస్తుంటుంది.

తాజాగా ఆదిత్య అనే ఓ ఫాలోవర్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది అనసూయా. మూడేళ్ళ క్రితం అనసూయ ఒక స్టేజీ మీద కళ్ళు తిరిగిపడిపోయి వీడియో ఒకటి నెట్ లో పోస్ట్ చేసి ”అనసూయ ఓవర్ యాక్షన్ పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తుందని” ఏవేవో కామెంట్లు పెట్టాడు. ఈ వీడియో చూసిన అనసూయాకి వళ్ళు మండిపోయింది.  ” కామెంట్‌ చేయడం ఏజీ. నాకు లోబీపీ ఉంది. రెస్ట్ లెస్ గా పని చేస్తే కళ్ళు తిరుగుతాయి. విషయం తెలియకుండా పిచ్చిపిచ్చి గా వాగకు. నేను నీ అంత నీచంగా కామెంట్ చేయగలను. కానీ  నాకు సంస్కారం వుంది” అని చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది అనసూయ.  అనసూయ కామెంట్ చదివిన చాలా మంది లైట్ తీసుకోండి మేడమ్ అని బదులు ఇస్తున్నారు. కానీ అనసూయ మాత్రం నెగిటివ్ కామెంట్స్ ని భరించడానికి సిద్దంగా లేదని ఈ ఎపోసిడ్ మరోసారి రుజువుచేసింది.